calender_icon.png 2 July, 2025 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంత్యక్రియల సందర్భంగా హెలికాప్టర్‌తో నోట్ల వర్షం

02-07-2025 12:33:32 AM

  1. అమెరికాలోని డెట్రాయిట్‌కు చెందిన డారెల్ వింత కోరిక
  2. అతడి కోరిక మేరకు 5000 డాలర్లు వెదజల్లిన కుటుంబ సభ్యులు

న్యూఢిల్లీ, జూలై 1: అమెరికాలోని డెట్రాయిట్ ప్రాంతానికి చెందిన డారెల్ థామస్ (58) దాతృత్వ కార్యక్రమాలకు పెట్టింది పేరు. తాను చనిపోతూ కూడా సమాజానికి ఎంతో కొంత ఇచ్చివెళ్లాలని దృఢంగా భావించాడు. దీంతో తాను మృతిచెందిన తర్వాత హెలికాప్టర్ ద్వారా డబ్బులు వెదజల్లాలని ఆదేశించాడు. కాగా జూన్ 27న డారెల్ థామస్ అనారోగ్యంతో మృతిచెందగా, ఆయన కుటుంబం స్థానిక కానర్ స్ట్రీట్ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించింది.

అతడి చివరి కోరిక మేరకు హెలికాప్టర్ ద్వారా 5 వేల డా లర్లతో పాటు గులాబీల పూలను వెదజల్లిం ది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. థామస్ మేనకోడలు క్రిస్టల్ పెర్రీ మాట్లాడుతూ.. థామస్ డారెల్ తన మ రణంలోనూ సమాజం పట్ల ప్రేమను చాటుకున్నారని, అందుకే ఈ మార్గాన్ని ఎన్నుకు న్నారని తెలిపారు. కాగా ఈ దాత ప్రొఫెషనల్ కార్ రేసర్ కూడా కావడం విశేషం.