02-07-2025 12:37:46 AM
చెన్నై, జూలై 1: తమిళనాడులో 27 ఏళ్ల అజిత్ కుమార్ పోలీస్ కస్టడీలో మరణించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాకప్ డెత్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి బదిలీ చేస్తున్నట్టు ప్రకటించింది.
పోలీసుల చర్య క్షమించరానిదని పేర్కొన్న ముఖ్యమంత్రి స్టాలిన్ దర్యాప్తులో ఎటువంటి సందేహాలకు తా వు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే సీబీఐ కి అప్పగించాలని ఆదేశించినట్టు వెల్లడించారు. శివగంగై జిల్లా తిరుప్పు వనం సమీపం మడపురంలోని ప్రసి ద్ధ భద్రకాళియమ్మన్ ఆలయానికి ఇటీవల వచ్చిన ఇద్దరు మహిళా భక్తుల నగలు అపహరణకు గురయ్యాయి.
ఈ కేసులో ఆలయ సెక్యూ రిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న అజిత్ కుమార్ సహా పలువురిని విచారించారు. ఈ క్రమంలో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అజిత్‌ను చిత్రహింసలకు గురి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.