calender_icon.png 26 July, 2025 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు చేపట్టిన సుజాత

26-07-2025 12:00:35 AM

వరంగల్,(విజయక్రాంతి): వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా కే. సుజాత శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం జరిగిన బదిలీలో భాగంగా షీ టీమ్ నుంచి వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా సుజాత బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేసిన కే. రామకృష్ణ వీఆర్ కి వెళ్ళారు. దీంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్ గా కోడూరి సుజాత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వాహనదారులు సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించలని కోరారు.