22 June, 2026 | 5:49 PM

సూపర్ స్పెషాలిటీ వైద్యం

06-08-2025 12:21 AM
  1. పీహెచ్‌సీల నుంచి వీడియో కాల్ ద్వారా సేవలు 
  2. విజయవంతంగా ఈ-సంజీవనీ టెలీ మెడిసిన్
  3. జనరల్ మెడిసిన్ నుంచి కార్డియాలజీ వరకు
  4. సేవలందిస్తున్న 20 రకాల స్పెషలిస్టు డాక్టర్లు
  5. గతేడాది 6 లక్షల మంది రోగులకు వైద్య సేవలు

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): ప్రజల వద్దకే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను తీసుకుపోయేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ-సంజీవనీ టెలీమెడిసిన్ రాష్ట్రం లో విజయవంతంగా నడుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సూపర్ స్పెషాలిటీ వైద్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. 2018లో ప్రారంభించిన  ఈ--సంజీవని ద్వారా రాష్ట్రంలో ఈ సేవలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి.

2022 నుంచి జనరల్ కన్సల్టేషన్ సైతం ప్రా రంభించడంతో పెద్దఎత్తున స్పందన వచ్చిం ది. పీహెచ్‌సీలో ఉన్న వైద్యులు, సిబ్బంది అక్కడికి వచ్చిన రోగులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీపంలోని స్పెషాలిటీ హబ్ కు మాట్లాడిస్తారు. రోగి సమస్యను అర్థం చేసుకున్న స్పెషాలిటీ వైద్యులు ఏ వైద్యం అందించాలో ప్రిస్క్రిప్షన్ ద్వారా పీహెచ్‌సీ వైద్యులకు సూచిస్తారు. ఆ ప్రకారంగా రోగికి వైద్య సేవలు అందుతాయి.

అవసరమైతే సదరు రోగిని చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లేదా ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలిస్తారు. రాష్ట్రంలో 2022 నుంచి ఇప్పటి వరకు 2.52 కోట్ల జనరల్ కన్సల్టేషన్ వైద్య సేవలు అం దాయి. స్పెషలిస్టు వైద్యుల ద్వారా 17 లక్షల కన్సల్టేషన్ సేవలూ అందాయి. కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టి ఈ- సంజీవని (esanj eevani.mohfw.gov.in) వెబ్‌సైట్ లింక్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. 

పీహెచ్‌సీలోనే స్పెషాలిటీ సేవలు

జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, డైటే ట్రిక్స్, జనరల్ సర్జరీ, ఫిజియోథరెపీ, అప్తల్మాలజీ, , నెఫ్రాలజీ, సైకియాట్రి, ఎండోక్రై నాలజీ, పల్మనాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ, యురాలజీ, కార్డియాలజీ, ఆంకాలజీ వైద్య సేవలు నిత్యం పీహెచ్‌సీలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందిస్తా రు. ఇప్పటి వరకు 4,11,304 మంది రోగులకు జనరల్ మెడిసిన్, 3,01,949 మందికి గైనిక్, 1,91,674 మందికి పీడియాట్రిక్, 1, 61,604 మందికి ఆర్థోపెడిక్స్, 1,12,462 మ ందికి ఈఎన్‌టీ, 1,05,099 మందికి డెర్మటాలజీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించారు.  

77 స్పెషాలిటీ హబ్‌లు.. 1000 మంది స్పెషాలిటీ డాక్టర్లు

రాష్ట్రవ్యాప్తంగా 77 స్పెషాలిటీ హబ్‌లను ఈ వైద్య సేవలకు వినియోగిస్తున్నారు. జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులను ఈ స్పెషాలిటీ వైద్యానికి హబ్‌గా మార్చారు. ఇందులో వెయ్యి మంది స్పెషాలిటీ వైద్యులు 20 రకాల స్పెషాలిటీస్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిత్యం రోగులకు వైద్యం చేస్తు న్నారు.

రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలకు వచ్చే రోగులు ఈ సేవలు పొందుతున్నారు. ఈ సేవలు వెబ్, ఆండ్రాయిడ్ యాప్ ద్వారా అం దుబాటులో ఉన్నాయి. ఈ- ప్రిస్క్రిప్షన్, ఈ- -హెల్త్ రికార్డు వంటి సదుపాయా లతో వైద్యులు ఆన్‌లైన్ వైద్య సేవలు అందిస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈసంజీ వని వెబ్‌సైట్ లింక్ ద్వారా తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ చక్కగా ఈ సేవలను గ్రామీణ రోగులకు అందిస్తున్నారు.