calender_icon.png 1 August, 2025 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూపర్ ఫ్రూట్ ‘అవకాడో’

31-07-2025 12:08:31 AM

నేడు ‘జాతీయ అవకాడో దినోత్సవం :

అవకాడో అద్భుత పోషక విలువలతో ‘సూపర్ ఫ్రూట్’గా ప్రసిద్ధిగాంచింది. అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో విస్తారంగా వినియోగిస్తున్న అవకా డోలు మన భారత్‌లోకి కూడా అడుగుపెట్టాయి. భారత్‌లో అందరికీ అమృత ఆహారంగా ఇవి మన  మెనూలోకి చేరిపోయాయి. అవకాడో ఫ్రూట్ కూ రగాయల వర్గానికి చెందింది అని పొరబడటం మానుకోవా లి. అది ఓ పండు. అవకాడో పండ్లను సలాడ్, టోస్ట్, స్మూథీస్ ఇలా పలు రూపాల్లో ఉపయోగించుకునేందుకు వీలుంది.

ఇటీవల విశేష ఆదరణ పొందిన ఈ అద్భుత పండ్ల పోషక విలువలను ప్రజలకు తెలియజేయడానికి ప్రతి ఏడాది జూలై 31న ‘జాతీయ అవకాడో దినం’ పాటించడం 2018 నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఆరోగ్యకరమైన, రుచికరమైన అవకాడో పండ్లలో అత్యంత ముఖ్యమైన పోషకవిలువలు న్నాయి. ఈ అవకాడోల్లో ఆర్చి పండ్లలో కంటే ఎక్కువగా పొటాషి యం ఉంటుంది. చెట్టు నుంచి తెంపిన తర్వాతనే అవకాడో పండుతుంది. ఆకలి పెంచడానికి మంచి అపటైజర్‌గా ఇది పని చేస్తుంది.

2015లో అమెరికాలోనే దాదాపు 4.25 బిలియన్ల అవకాడో పండ్ల అమ్మకాలు జరిగాయి. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించే అవకాడోలో మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇన్సులిన్ నిరోధకతను సరిచేయగల అవకాడోలో విటమిన్ సీ, ఈ, కే లాంటివి సమృద్ధిగా ఉంటాయి. అల్జీమర్స్ వ్యాధి కట్టడికి అవసరమైన ఒమెగా 3 ఫాటీ ఆమ్లాలు అవకాడోలో ఉంటాయి. అవకాడోలో ఉన్న ఓలిక్ యా సిడ్ చర్మం తేమతో ఎర్రబారకుండా, ఇరిటేషన్ కలగకుండా చర్మఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అవకాడోలు తీసుకోవడం అవసరం

 డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, హైదరాబాద్