31-07-2025 12:11:25 AM
ఇదిగో అదిగో అంటున్న భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం ఇంకా కొలిక్కి రాలేదు. గత కొద్ది రోజులుగా అమెరికా, ఆర్థికంగా శక్తివంతమైన యూరప్ దేశాలతో, జపాన్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకొంది. ఆగస్టు 1 నాటికి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోకపోతే భారత్‌పై 20-26 శాతం సుంకాలు విధిస్తామని తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇప్పుడు గడువు ముగియకుండానే అన్నం తపనీ చేశారు.
ఆగస్టు 1 నుంచి 25 శాతం సుంకాలు, అదనంగా పెనాల్టీ చెల్లించాలని భారత్‌పై భారం మోపారు. భారత్ తమకు మిత్రదేశం అయినప్పటికీ రష్యా నుంచి పెద్దఎత్తున చమురు, ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నది కనుక సుంకాలు, పెనాల్టీ విధించక తప్పడం లేదని ట్రం ప్ సమర్ధించుకున్నారు. ట్రంప్ తొలుత విధించిన జూలై 9 గడువులోగానే అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం జరుగుతుందని భావించినా, ఆ తర్వాత అనేక దఫాలుగా వాణిజ్య చర్చలు జరిగాయి.
వ్యవసాయం, డెయిరీ, జన్యుమార్పిడి ఉత్పత్తులపై భారతీయ మార్కెట్‌ను బార్లా తెరవాలని అమెరికా ఒత్తిడి తెస్తున్నది. అలా చేస్తే భారతీయ రైతుల పొట్టకొట్టడమే అవుతుందని భారత్ అందుకు విబేధిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లో త మ ఉత్పత్తులను విక్రయించడంలో పోటీపడేందుకు సుంకాలు ప్రతిబంధ కం కాకూడదని కూడా భారత్ భావిస్తున్నది.
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికలు కూడా వాణిజ్య ఒప్పందం ఆలస్యానికి కారణం అయింది. ఆగస్టు 1 తర్వాత, అమెరికా దిగుమతి చేసుకునే భారత ఉత్పత్తులపై 26 శాతం సుంకాల విధింపు ఉంటుంది. ఆగస్టు 1 గడువు ముగిస్తే, తదుపరి చర్చల కోసం అమెరికా ప్రతినిధి బృందం 25న భారత్‌లో పర్యటిస్తుంది.
అయితే అమెరికా విధించే గడువుల మాటెలా వున్నా, దేశ ప్రయోజనాల ను, మన ఉత్పత్తులకు తగిన లాభం చేకూరడంపైనే భారత్ దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. ఆగస్టు 1 డెడ్‌లైన్‌గా ట్రంప్ అనేక దేశాలకు ఉత్తరాలు పం పారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోకపోతే గడువు ముగిసిన తర్వాత సుంకాల వాతలు తప్పవనీ హెచ్చరించారు. ప్రతీకార సుంకాలు విధిస్తామంటూ అమెరికా మొదట ఏప్రిల్‌లోనే ప్రకటించింది.
దానిని 90 రోజులపాటు జూలై 9వరకు పొడిగించింది. చర్చలు విపులంగా జరిగేందుకు ఆ తర్వాత ఆ గడువును ఆగస్టు 1గా నిర్ణయించింది. అమెరికాతో ఇ ప్పటివరకు జరిగిన చర్చల్లో భారత్ తన వ్యవసాయరంగ ప్రయోజనాలను స్పష్టం చేస్తూనే, జౌళి, ఆభరణాలు, లెదర్ సంబంధిత ఉత్పత్తులు, ప్లాస్టిక్, రసాయనాలు, దుస్తులు, నూనె గింజలు, పండ్లు వంటి వాటికి అ మెరికా మార్కెట్లు దిగుమతిలో ప్రాధాన్యతనివ్వాలని కోరుతున్నది.
ఈ ఏ డాది ఏప్రిల్‌జూన్ త్రైమాసికంలో అమెరికాకు భారత్ ఎగుమతులు 22.8 శాతం పెరిగాయి. ఇదే సమయంలో మన దేశానికి అమెరికా దిగుమతుల్లో కూడా 11.68 శాతం పెరుగుదల కనిపించింది. రెండు దేశాల మధ్య బలమైన వాణిజ్య సంబంధానికి ఇది నిదర్శనం. అయినా అనేక వంకర కారణాలతో ట్రంప్, భారత్‌పై సుంకాల కొరడా ఝుళిపించడం ట్రంప్‌కె చెల్లు.