calender_icon.png 9 August, 2025 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా ఆస్తిత్వం.. మా ఆత్మగౌరవం మా “గోర్ బోలి” బంజారా భాష

09-08-2025 03:04:44 AM

- గిరిజన శక్తి రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్ చౌహన్ 

ముషీరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): బంజారా భాషా గోర్ బోలి నీ గుర్తించాలని కోరుతూ శుక్రవారం ఢిల్లీలో గిరిజన శక్తి, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిజన శక్తి రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ చౌహన్ మాట్లాడుతూ బంజారాల అస్తిత్వానికి ఆత్మగౌరానికి ప్రతీక గోర్ బోలి భాష అని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగింది, కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నాన్సుడు ధోరణితో వ్య వహరించడం బాధాకరమని అన్నారు.

గత మూడు రోజులుగా మేము అన్ని పార్టీల ఎంపీలను కలిసి బంజారా భాష, చరిత్ర అనేక సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లోని కోట్ల మంది బంజారా మాట్లాడే ఈ భాష చరిత్రను గొప్పతనాన్ని సింధు నాగరికత నుంచి భాష యొక్క మూలాలను గురించి వివరించి వారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. అటువంటి భాషను విస్మరిస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో బంజారా తండాల్లో తమ తడాఖా చూపిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. 

అదే విధంగా మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్    మాట్లాడుతూ  పురాతన చరిత్ర కలిగినటు వంటి బంజారా భాషను ఇప్పటివరకు గుర్తించుకోకపోవడం మా ఉని కికే ప్రమాదంగా మారిందన్నారు. గిరిజన సంక్షేమ సంఘం రాష్ర్ట అధ్య క్షుడు లప్పతి నాయక్‌గిరిజన విద్యార్థి సమితి రాష్ర్ట అధ్యక్షులు శివ నా యక్ మాట్లాడుతూ ఎన్నో రోజులుగా మొరపెట్టుకుంటున్న మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదని మా ఓపికను పరీక్షించవద్దన్నారు.  కార్య క్రమంలో నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు మోహన్ పవర్ అలాగే గిరిజన విద్యార్థి సమితి రాష్ర్ట ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ నాయక్ పాల్గొన్నారు.