6 May, 2026 | 7:55 PM

Breaking News

జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •  

రైతుల అభ్యున్నతికి సహకారం

06-02-2025 12:14 AM

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, డీసీసీబీ చైర్మన్ కొత్తకురువ సత్తయ్య

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 5: రైతుల అభ్యున్నతికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, డి సి సి బి చైర్మన్ కొత్త కురువ సత్తయ్య పేర్కొన్నారు. జిల్లా సహకార భవన నూతన కార్యాలయం, దుకాణ సముదాయాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బుధవారం ప్రారంభించారు.

శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకుల గ్రామంలో నిర్మించిన రంగారెడ్డి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డిసిఎంఎస్)నూతన భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సర్కారు వివిధ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య, డీసీఎంఎస్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ పి.క్రిష్ణారెడ్డి, డైరెక్టర్లు, మాజీ జడ్పిటిసి నీరటి తన్వి రాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.