calender_icon.png 9 August, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు జడ్జీపై ఆంక్షల విషయంలో వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు

09-08-2025 02:55:59 AM

ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్టు పేర్కొన్న ధర్మాసనం

న్యూఢిల్లీ, ఆగస్టు 8: హైకోర్టు జడ్జీపై ఆంక్షల విషయంలో సుప్రీంకోర్టు వెనక్కి త గ్గింది. అలహాబాద్ హైకోర్టుకు చెందిన ఒక న్యాయమూర్తి రిటైరయ్యేంతవరకూ ఆయనకు క్రిమినల్ కేసులు అప్పగించకూడదని ఆంక్షలు విధిస్తూ ఈ నెల 4న వెలువరించిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్టు పే ర్కొంది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ అభ్యర్థన మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూ డిన ధర్మాసనం దీనిని వెనక్కి తీసుకుంది.

ఈ కేసు విషయంలో తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ సీజేఐ జస్టిస్ బీఆర్ గ వాయ్ నుంచి తమకు లేఖ అందిందని ధ ర్మాసనం పేర్కొంది. సంబంధిత న్యాయమూర్తికి ఇబ్బందులు కలిగించడం తమ ఉద్దే శం కాదని.. అయితే కొన్ని విషయాల్లో పరిమితులు దాటినప్పుడు న్యాయవ్యవస్థ గౌర వాన్ని కాపాడటమే కోర్టు పని అని జస్టిస్ పార్దివాలా తెలిపారు. న్యాయవ్యవస్థపై ప్రజ ల విశ్వాసాన్ని దెబ్బతీసే ఇటువంటి ఆదేశాలను విస్మరించలేమని స్పష్టం చేశారు.