14-08-2025 01:27:14 AM
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ఖీమ్యా నాయక్
రేవల్లి : ఆగస్టు 13 : గత రెవెన్యూ సదస్సులో తీసుకున్న దరఖాస్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) ఖీమ్యా నాయక్ అన్నారు, బుధవారం రేవల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయనకు ఆకస్మికంగా తనిఖీ చేసి, వివిధ ప్రభుత్వ పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు,ముఖ్యంగా భూభారతి రెవెన్యూ సదస్సులపై దృష్టి సారించి, పెం డింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అధికారులు ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలని రెవెన్యూ సిబ్బందిని సూచించారు.
రైస్ మిల్లుల పరిశీలన
తహసీల్దార్ కార్యాలయం సందర్శన అనంతరం అదనపు కలెక్టర్ రేవల్లి మండలంలోని చెన్నారం గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ ఇండస్ట్రీస్ మరియు సత్యసాయి ఇండస్ట్రీస్ను పరిశీలించారు. ఖరీఫ్ 2024-25 మరియు రబీ 2024-25 సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు,డెలివరీల పురోగతి చాలా నెమ్మదిగా ఉందని, తక్షణమే సీఎంఆర్ను ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లు యాజమాన్యాలను ఆదేశించారు,
సీఎంఆర్ డెలివరీలలో జాప్యం వల్ల ప్రభుత్వానికి, రైతులకు నష్టం వాటిల్లి సీఎంఆర్ డెలివరీలలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైస్ మిల్లులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన సీఎంఆర్ను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లా సివిల్ సప్లై అధికారి కాశి విశ్వనాథం, రైస్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.