calender_icon.png 9 September, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశనీపాతంలా సుప్రీం కోర్టు తీర్పు

08-09-2025 12:35:54 AM

సీనియర్ టీచర్లకు రక్షణ కల్పించాలి: టీఎస్ యూటీఎఫ్  

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): ఐదేళ్ల పైబడి సర్వీసున్న ఇన్ సర్వీస్ టీచర్లందరూ రెండేళ్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణులు కావాలని, లేదంటే ఉద్యోగాన్ని వదులుకోవాలని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు ఈనెల 1న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు చావ రవి, ఏ.వెంకట్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు. 

సర్వీసులో ఉన్న సీనియర్ టీచర్ల ప్ర యోజనాల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని కోరారు. పలు రాష్ట్రాల కేసులను కలిపి విచారించిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబర్ 1న వెలువరించిన తీర్పు సీనియర్ ఉపాధ్యాయులకు అశనీపాతంగా మారిందన్నారు. ఇరవై, పాతికేళ్లుగా సర్వీసు చేస్తున్న ఉపాధ్యాయులు ఇ ప్పుడు కేవలం రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణులు కావాలనడం భావ్యం కాదని,.

2015లో టె ట్ పరీక్ష నిబంధనలు రూపొందించిన ఉత్తర్వుల్లో 23-08-2010కి ముందు నియా మకమైన ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత మినహాయింపునిచ్చారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు రెండేళ్లలో టెట్ పాస్‌కావాలంటే దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ భ యాందోళనలకు లోనవుతున్నారని, 2010 తర్వాత నియామకమైన టీచర్లకు మాత్రమే తప్పనిసరి చేయాలని, అంతకుముందువారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు.