calender_icon.png 8 September, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి

08-09-2025 12:34:52 AM

మంచిర్యాల సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : బేవరేజస్ హమాలీలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలనీ, హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలనీ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు మర్రి ఎల్లన్న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని హరిత ఫంక్షన్ హాల్ లో బేవరేజస్ హమాలీ వర్కర్స్ (సీఐటీయూ) యూనియన్ రాష్ట్ర నాలుగవ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తో కలిసి ఆయన మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా బేవరేజస్ కార్పొరేషన్ 19 గోదాముల్లో సుమారు 2 వేల మంది హమాలీ కార్మికులు డిపోలనే నమ్ముకొని లోడిం గ్,  అన్ లోడింగ్ పనులు చేస్తున్నారని, బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 40 వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతుందన్నారు.

బేవరేజస్ హమాలీ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వంగూరు రాములు మాట్లాడుతూ రాష్ట్రంలో 19 గోదాముల్లో ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మాత్రమే ప్రభుత్వ గోదాములు ఉన్నాయనీ, మిగిలిన 15 గోదాములు ప్రైవేటుకు లీజుకు తీసుకొని లక్షల రూపాయలు చెల్లిస్తున్నారన్నారని ఆరోపించారు.   బేవరేజస్ హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి ఎల్లన్న జెండా ఆవిష్కరణ చేసిన  అనంతరం ఈ మధ్య కాలంలో మరణించిన అమరవీరులకు  నివాళులర్పించారు.

అంతకు ముందు ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ మహాసభలో రాష్ట్రంలోని అన్ని బేవరేజస్ డిపోల నుంచి హమాలీలు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్, రాజేశ్వరి, మండల కన్వినర్ చల్లూరి దేవదాస్ పాల్గొన్నారు.