calender_icon.png 9 September, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ విధానాలతో పత్తి రైతులపై ప్రభావం

08-09-2025 12:36:14 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 7(విజయ క్రాంతి):కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశంలో పత్తి పంట కొనుగోలుపై రానున్న రోజుల్లో ప్రభావం పడనుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవికుమార్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కుశాన రాజన్న అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్, మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాల కార్యదర్శులు సంకె రవి,  మల్లేష్ తో కలసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పంటపై ఉన్న 11% టారిఫ్ ను సున్నాకు తేవడంతో దేశంలోని పత్తి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతులకు యూరియా పంపిణీపై నిర్దిష్ట విధానం లేకపోవడమే కొరతకు కారణమన్నారు. రైతులు యూరియాకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ బీజేపీ నేతలు మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్, జిల్లా కార్యదర్శి రాజన్న, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.