calender_icon.png 24 August, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం...

24-08-2025 07:11:50 PM

కోదాడ: ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ప్రజాపిత బ్రహ్మాకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం వారి మాజీ నిర్వాహకురాలు దాది ప్రకాష్ మణి 18వ స్మృతి దినోత్సవం సందర్భంగా విశ్వబంధుత్వ దినోత్సవంలో భాగంగా ఆదివారం స్థానిక బ్రహ్మకుమారి వారి ఆధ్వర్యంలో  తిరుమల బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ డాక్టర్ ప్రమీల, రాజయోగిని బ్రహ్మకుమారి లక్ష్మి, బ్రహ్మకుమారి త్రివేణి  జ్యోతి ప్రజ్వలనతో  కార్యక్రమాన్ని ప్రారంభించారు.

డాక్టర్ ప్రమీల మాట్లాడుతూ బ్రహ్మకుమారి శివారు దయా హృదయంతో సమాజం మానవాళి యొక్క ఆరోగ్యం శాంతి సుఖవంతమైన జీవితం జీవించటానికి ఎంతో కృషి చేస్తున్నారని అభినందనలు తెలిపారు. రాజయోగి బ్రహ్మకుమారి త్రివేణి  మాట్లాడుతూ... రక్తం యొక్క విలువను రక్తం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ రక్త దాతలకు భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని వారు తెలిపారు. ఎంతోమంది జీవితాలను నిలబెట్టే అదృష్టం కలుగుతుంది అని  విశేషంగా సంస్థ యొక్క సభ్యులు ప్రతి ఒక్కరు తమ తమ సహయోగం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. 30 మంది రక్తదానం చేసినట్లుగా పేర్కొన్నారు.