24-08-2025 07:15:30 PM
మంథనిలో యూట్యూబ్ కళాకారుల సమావేశంలో డైరెక్టర్ నారామల్ల కృష్ణ
మంథని,(విజయక్రాంతి): మంథనిలో నియోజకవర్గంలోని మంథని, రామగిరి, ముత్తారం, కమాన్ పూర్ మండలాలకు చెందిన యూట్యూబ్ కళాకారులతో రచయిత, డైరెక్టర్ నారామల్ల కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కృష్ణ మాట్లాడుతూ... యూట్యూబ్ వేదిక ప్రతి ఒక్కరికి తమ ప్రతిభను ప్రపంచానికి చూపే అవకాశం ఇస్తోందని, సంగీతం, నటన, జ్ఞానం, వినోదం– ఏ రంగమైనా మనం సృష్టించే కంటెంట్ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు.
అలాగే మన ప్రతిభను పంచుకోవడం ద్వారా మనం జీవనోపాధి పొందడమేకాక కాక సమాజంలో కూడా గౌరవం దక్కుతుందని తెలిపారు. కాబట్టి అన్ని విభాగాల కళాకారులు అందరూ ఒక తాటిపై వచ్చి ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలని కోరారు. ఆసక్తి కలిగిన కళాకారులు 95739 00210 నెంబర్ కు సంప్రదించాలని, కళాకారుల ఉన్నతి కోసం త్వరలో కమిటీని వేసి భవిషత్తు కార్యచరణ తీసుకుని కళాకారులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామన్నారు.