17 April, 2026 | 5:34 AM

బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానం బోర్డు సభ్యునిగా నియమితులైన సురేష్ వర్మ

28-06-2025 12:20 AM

సనత్ నగర్,(విజయ క్రాంతి): రాజ్యసభ సభ్యులు  అనిల్ కుమార్ యాదవ్, బల్కంపేట శ్రీ ఎల్లమ్మ దేవస్థానం బోర్డు సభ్యునిగా నియమితులైన పి. సురేష్ వర్మకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బల్కంపేట ఎల్లమ్మ ఆలయం తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పుణ్యక్షేత్రం. ఈ ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలకీ శ్రీ సురేష్ వర్మ నిబద్ధతతో పనిచేస్తారని నాకు పూర్తి నమ్మకముంది. ఆయన సేవా ప్రవర్తనకు ఇది సరైన గుర్తింపు.