28-10-2025 04:42:41 PM
హైదరాబాద్: మావోయిస్టు కీలక నేత బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్, మరో కీలక నేత పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న డీజీపీ శివధర్ రెడ్డి(Telangana DGP Shivdhar Reddy) సమక్షంలో మంగళవారం లొంగిపోయారు. ఈ సందర్భంగా చంద్రన్న మీడియాతో మాట్లాడుతూ... మాది లొంగుబాటు కాదు అభివృద్ధిలో కలిసి పని చేయడానికి వచ్చామని చెప్పారు. ఇప్పటి వరకు ఉద్యమంలో పీడిత ప్రజల కోసమే పని చేశానని, భవిష్యత్తులో కూడా ప్రజల కోసమే పని చేస్తానని తెలిపారు. మా సిద్ధాంతం ఓడిపోలేదని, ఓడించడం ఎవరితరం కాదని, ప్రజల మధ్య ఉండి సేవ చేయాలనుకున్నానని హితవు పలికారు. నా ఆయుధాలను పార్టీకి ఇచ్చి వచ్చానని చంద్రన్న పేర్కొన్నారు.
మావోయిస్టు కీలక నేత పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న తెలంగాణ 1980లో కిషన్ జీకి అనుచరుడిగా మరి 1981లో పీపుల్స్ వార్ లో చేరిన ఆయన 1983లో కమాండర్ అయ్యారు. 1992లో ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పని చేసిన పుల్లూరి ప్రసాద్ 2008లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎన్నికై 17 ఏళ్లపాటు పని చేశారు.