28-10-2025 04:04:27 PM
హైదరాబాద్: మావోయిస్టు కీలక నేత బండి ప్రకాశ్, మరో కీలక నేత పుల్లూరి ప్రసాద్ రావు డీజీపీ శివధర్ రెడ్డి(Telangana DGP Shivdhar Reddy) సమక్షంలో మంగళవారం లొంగిపోయారు. ఈ సందర్భంగా మావోయిస్టుల లొంగుబాటు సంబంధిన వివరాలపై డీజీపీ శివధర్ రెడ్డి సమామవేశం నిర్వహించారు. బండ ప్రకాశ్ స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి అని, ఏడో తరగతి చదువుతున్నప్పుడే నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు. 2004లో జరిగిన శాంత చర్చల్లో పాల్గొన్న బండ ప్రకాశ్ 2019లో స్టేట్ కమిటీ సభ్యుడయ్యారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న బండి ప్రకాశ్ మావోయిస్టు పార్టీలో 45 ఏళ్లు వివిధ స్థాయిల్లో పనిచేశారు. ప్రభాత్ అనే పేరుతో ప్రెస్ టీమ్ ఇన్ ఛార్జిగా, బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ నేషనల్ పార్క్ ఏరియా కీలక ఆర్గనైజర్ గా పనిచేశారు.
మరో కీలక నేత పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న తెలంగాణ 1980లో కిషన్ జీకి అనుచరుడిగా మరి 1981లో పీపుల్స్ వార్ లో చేరిన ఆయన 1983లో కమాండర్ అయ్యారు. 1992లో ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పని చేసిన పుల్లూరి ప్రసాద్ 2008లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎన్నికై 17 ఏళ్లపాటు పని చేశారు.
ఇప్పటికే దేశంలో అనేక మంది మావోయిస్టు కీలక నేతలు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా మావోయిస్టు జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునివ్వడంతోనే ప్రకాశ్, పుల్లూరి ప్రసాద్ లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడించారు. బండి ప్రకాశ్ పై ఉన్న రూ.20 లక్షల రివార్డు, పుల్లూరి ప్రసాద్ రావుపై ఉన్న రూ.25 లక్షల రివార్డును ఆయనకు అందిస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కరెక్ట్ కాదని, వారికి రక్షణ కల్పిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.