calender_icon.png 28 October, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశువులకు టీకాలతోనే గాలికుంటు వ్యాధి నివారణ

28-10-2025 07:38:13 PM

తుంగతుర్తి పశు సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు..

తుంగతుర్తి (విజయక్రాంతి): పశువులకు సమయానికి టీకాలు వేస్తే గాలికుంటు వ్యాధి నివారించవచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసి మాట్లాడారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి సోకితే పాల ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని తద్వారా మన పాలు మాంసం విదేశాలకు ఎగుమతి చేసి అధిక ఆదాయం పొందాలని చూస్తున్నాయని ప్రతి ఒక్క తప్పకుండా తమ పశువులకు టీకాలు వేయించాలని తెలిపారు. గ్రామంలో 18 తెల్ల పశువులకు, 64 నల్ల పశువులకు మొత్తంగా 82 పశువులకు టీకాలు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ నరేష్, వీఏఎన్ రవికుమార్, ఓఎస్ నాగరాజు, పశుమిత్ర గణిత, రైతులు తదితరులు పాల్గొన్నారు.