calender_icon.png 28 October, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపికైన విద్యార్థులు

28-10-2025 07:35:44 PM

కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ విద్యార్థులు ఎస్జిఎఫ్ రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపిక అయ్యారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో పాఠశాలలో విద్యార్థులు ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపికైన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అభినందసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని క్రీడా రంగాలలో నైపుణ్యం వచ్చేవిధంగా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడంతో పాటు సరైన శిక్షణ అన్ని వేళల్లో విజేతలుగా ఉంటారని చెప్పారు. క్రీడల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని పాఠశాలలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహిస్తున్నామని, వివిధ స్థాయిలలో నిర్వహింపబడేటటువంటి పోటీలకు ఎంపిక చేస్తున్నారని తెలిపారు.

ఈ క్రమంలో ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి ఎస్ జి ఎఫ్ జోనల్ స్థాయి అండర్-14 చెస్ పోటీలలో శివస్, అండర్-17 విభాగంలో పి.విశ్వంత్, వి. అభిరామ్ అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనారని హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన సందర్భంగా విజేతలకు పుష్పగుచ్చాలను అందజేసి రానున్న రోజుల్లో నిర్వహించేటువంటి రాష్ట్రస్థాయి పోటీలలోను జయకేతనం ఎగరవేయాలని మరి జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించే విధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.