28-10-2025 07:45:49 PM
అధికారుల నిర్లక్ష్యమే కారణమా...?
గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల తండాలో గూగులోత్ రాజు నాయక్ కు చెందిన గుడిసె విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతి అయింది. రాజు నాయక్ మాట్లాడుతూ తండాలో కరెంట్ డబుల్ పేస్ వస్తుందని పలుమార్లు హెల్పర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తెలిపాడు. సెస్ అధికారులు ముందుగానే చర్యలు తీసుకొని ఉంటే ప్రమాదం జరిగేది కాదని వాపోయాడు. ఈ ఘటనలో సుమారు 90 వేల రూపాయల నష్టం వాటిల్లినట్టు బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం, సెస్ అధికారులు చొరవ తీసుకొని ఆర్థిక సాయం అందించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.