01-11-2025 07:16:50 PM
విజన్ ఎన్జీవో సంస్థ సిఎస్ఎం నవనీత
కొల్చారం: బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని విజన్ ఎన్జీవో సంస్థ సిఎస్ఎం నవనీత అన్నారు. శనివారం అప్పాజీపల్లిలో బాల్య వివాహాల నిర్మూలన, పిల్లలు అభివృద్ధిపై అధికారులకు, గ్రామస్తులకు విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బాల్య వివాహాలు జరగకుండా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి బాల్యవివాహాలు జరగకుండా చూడాలన్నారు.
బాల్య వివాహాలు జరిగితే అంగన్వాడీ, ఆశా, పంచాయతీ కార్యదర్శులదే బాధ్యతని తెలిపారు. బాలికలకు సంబంధించిన వివరాలు బిఎల్ఓల వద్ద ఉండాలన్నారు. కిషోర్ బాలికలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయం తప్పనిసరిగా సేకరించాలని సూచించారు. విజన్ ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు.