నకిరేకల్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సూర్యచంద్రర్ రావు ప్రమాణ స్వీకారం
శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, జూన్ 22: నకిరేకల్ పట్టణంలోని నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నకిరేకల్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సూర్యచంద్రర్ రావు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో సోమవారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సూర్యచంద్రర్ రావుకు ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ప్రజా సేవలో లయన్స్ క్లబ్ పోషిస్తున్న పాత్ర అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైద్య, విద్య, రక్తదానం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో క్లబ్ మరింత చురుకుగా సేవలు అందించాలని సూచించారు. సమాజ సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సామాజిక సేవకులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.






