23 June, 2026 | 2:30 AM

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

23-06-2026 01:03 AM

కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

కోదాడ, జాన్ 22: చదువుల తల్లి సరస్వతి దేవి ఆశీస్సులతో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్ నందు స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహావిష్కరణ మహోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలల్లో చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అప్పుడే గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ నీలా సత్యనారాయణ, చారు గండ్ల ప్రవీణ, రాజశేఖర్, ఎంఈఓ సలీం షరీఫ్, ఓరుగంటి కిట్టు, స్థానిక కౌన్సిలర్ సైది బాబు, చెన్నకేశవరావు, పందిరి సత్యనారాయణ, ఓరుగంటి ప్రభాకర్, వెంపటి వెంకటరమణ, దేవరశెట్టి శంకర్రావు, సతీష్, సాయి, ప్రసాద్, ఓరుగంటి రమాదేవి, యధా రాణి, నాగలక్ష్మి, స్వాతి, సత్య, విజయలక్ష్మి,రంగారావు, కాలంగి వెంకటేశ్వర్లు, కందిబండ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.