23 June, 2026 | 1:58 AM

ముస్తాబాద్‌లో విత్తన మేళా

23-06-2026 12:59 AM

ముస్తాబాద్,జూన్ 22( విజయ క్రాంతి )ప్రభుత్వ నిర్ణయం మేరకు 23 జూన్ నుండి 30జూన్ 2026 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతువేదికలలో విత్తన మేళా నిర్వహించబడనుంది. కావున ఈ మేళాలో ప్రభుత్వం సూచించిన 7 సన్న రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉంటాయని రైతులు తమకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను ఒకే చోట కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించబడిందని మండల వ్యవసాయ అధికారి అనూష పేర్కొన్నారు. రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విత్తన మేళాలో పాల్గొని తమకు కావలసిన విత్తనాలను కొనుగోలు చేసుకోవలసిందిగా కోరారు.