30-04-2025 07:49:03 PM
బెల్లంపల్లి అర్బన్: పదవ తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు బుధవారం వెలుపడ్డాయి. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి ప్రభుత్వ పాఠశాల ఎస్ఎస్సీ ఫలితాల్లో అత్యధిక మార్కులతో మండల టాపర్ గా విజయడంక మోగించింది. ఆకెనపల్లి జడ్పిహెచ్ఎస్ హైస్కూల్ కీ చెందిన విద్యార్థిని వై సుస్మిత ఎస్ఎస్సీలో 600 మార్కులకు గాను 561 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల మండల టాపర్ గా నిలిచింది. అత్యధిక మార్కులతో తమ ప్రతిభను చాటి మండల టాపర్ గా నిలిచిన సుస్మితను ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాధు లింగయ్య, హిందీ ఉపాధ్యాయులు హరిసాయి బాబా, వ్యాయామ ఉపాధ్యాయులు రాజ్ మహమ్మద్ అభినందించారు.