04-05-2025 12:53:47 AM
పది ఫలితాల్లో విద్యార్థుల సత్తా
కరీంనగర్, మే 3 (విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాల్లో ఎస్వీజేసీ విద్యాసంస్థలు, జాన్సన్ గ్లోబల్ హైస్కూల్, కోరా పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల సెక్రటరీ, కరస్పాండెంట్ ఊట్కూరు మహిపాల్‌రెడ్డి మాట్లాడు తూ.. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల కు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపా రు.
పటిష్టమైన విద్యాప్రణాళికకు ప్రతి విద్యార్థి సక్సెస్ ప్రధాన ఉద్దేశంగా తమ ప్రణాళికను రూపొందించామన్నారు. దీనికి అహర్నిశలు ఉపాధ్యాయవర్గం కృషి, విద్యార్థుల కష్టంతో రాష్ట్రస్థాయిలో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా విజయదుందుభి మోగించడం గర్వంగా ఉన్నదన్నారు. రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు సాధించిన మార్కు లు.. కే వినూత్న 580, ఏ తరుణిక 572, పూజిత 572, ఎన్ శ్లోకారెడ్డి 572, బి శ్రీవ ర్ష570, శ్రీకర్ 569, టి శౌర్యతేజ 566, సాధించారు.
ఏ సహస్ర 564, ఏ మనుజ్ఞ 557, లిఖిత గుప్తా 552, పరంకుశం శ్రీహర్ష 549 మార్కులు సాధించారు. 500 కుపైగా 50 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులను కరస్పాండెంట్ మహిపా ల్‌రెడ్డితోపాటు మేడ వెంకట వరప్రసాద్, కాంతలా రాంరెడ్డి, వంగళ సంతోష్‌రెడ్డి, సిం హాచలం హరికృష్ణ అభినదించారు.