24-05-2025 08:48:19 PM
నిర్మల్ (విజయక్రాంతి): నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy) ఎక్స్‌రే సెంటర్ ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారి వెంబడి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, స్థానికంగా ఉన్న ఈ హాస్పిటల్ ను గత ప్రభుత్వం 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించినా ఆచరణలో మాత్రం చేపట్టలేకపోయిందని అన్నారు. కనీస వసతులు, సిబ్బంది కొరత తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత మేరకు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
నర్సాపూర్ మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నర్సాపూర్ మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం ను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. తడిసిన ధాన్యంను సైతం ప్రభుత్వం కొనాలని, త్వరితగతిన వడ్ల కొనుగోలు పూర్తి చేయాలని, అధిక తూకం, రైస్ మిల్లులో కటింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, రావుల రాంనాథ్, ముత్యం రెడ్డి, చంద్రకాంత్, మండల అధ్యక్షులు బర్కుంట నరేందర్,స్థానిక నాయకులు శ్రీకాంత్ రెడ్డి, అర్జున్, నాయకులు రాంశంకర్ రెడ్డి, మహిపాల్,దత్తురాం, రాజేందర్, రాజు, తో పాటు వైద్య అధికారులు రాజేందర్, ప్రమోద్ చంద్ర రెడ్డి, తో పాటు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.