24-05-2025 08:45:03 PM
మండల విద్యాధికారి ఎన్ శంకర్..
సదాశివపేట (విజయక్రాంతి): సదాశివపేట మండలంలోని ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులకు గత 5 రోజులుగా సెయింట్ ఆంథోని పాఠశాలలో శిక్షణ నిర్వహించడం జరిగిందని, శిక్షణ ముగింపు కార్యక్రమంలో టీచర్స్ మాట్లాడుతూ... ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉందని, ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ, ఎన్నో నూతన అంశాలు నేర్చుకున్నామని, నేర్చుకున్న ప్రతి అంశాన్ని పాఠశాలకు వెళ్లి, పాఠశాలలో గుణాత్మక, నిర్మాణాత్మక విద్యను విద్యార్థులకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని మండల విద్యాధికారి ఎన్.శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీలు యూసుఫ్, మల్లేశం,అబ్దుల్ కలాం, సురేష్, ప్రవీణ్ కుమార్, మహేష్,టీచర్స్, సిఆర్పిలు పాల్గొన్నారు.