04-05-2025 12:52:10 AM
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): ఇటీవల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 596/600 మార్కులు సాధించిన విద్యార్థిని ఎస్ క్రితిని శనివారం నిజామాబాద్ జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాష్ట్రస్థాయి మార్కులు తెచ్చు కొని వారి తల్లిదండ్రులకే కాకుండా జిల్లాకు, రాష్ట్రానికి కూడా కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిం దని కొనియాడారు. ఇంతటి కృషికి కార కులైన కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ యాజమాన్యాన్ని, ఉపాధ్యాయ బృందాన్ని ఆమె అభినందించారు. కేవోఎస్‌లో ఉన్న ఐఐటీ మెడికల్ ఫౌండేషన్ ఎంతో చక్కగా ప్రణాళికబద్ధంగా శిక్షణ ఇవ్వడం వల్ల ఇంత టి మార్కులు సాధించానని విద్యార్థిని క్రితి తెలిపింది. కేవోఎస్ డైరెక్టర్ సిహెచ్.
రామో జీరావు మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ప్రతిభను గుర్తించే విధంగా విద్యా ప్రణాళి కలు కాకతీయ ఒలంపియాడ్ స్కూల్‌లో ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తండ్రి డాక్టర్ కృష్ణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భాస్కరరావు, వివిధ జ్యుడిషరీ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.