calender_icon.png 25 May, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ శాంతినగర్ ఎత్తి పోతల పథకం పనులు వెంటనే పూర్తిచేయాలి

24-05-2025 08:42:04 PM

రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి 

కోదాడ: రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. శనివారం అనంతగిరి మండలం శాంతినగర్ లోని పాలేరు వాగుపై 54 కోట్ల రూపాయలతో నిర్మించే రాజీవ్ శాంతి నగర్ ఎత్తి పోతల పథకంను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ... గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డిచే శాంతి నగర్ లిప్ట్ ని ప్రారంభించటం జరిగిందని, 2016 తరువాత లిప్ట్ పని చేయటం లేదని గత ఆగస్టు 30న వచ్చిన వరదతో పుంపు హౌస్ దెబ్బ తినదని తెలిపారు.

ఎంత పెద్ద వరద ఉదృతినైనా తట్టుకునేలా శాశ్వతంగా ఉండేలా గత పంపు హౌస్ కంటే 3 మీటర్ల ఎత్తులో రాజీవ్ శాంతి నగర్ లిప్ట్ నిర్మించటం జరుగుతుందని దీని ద్వారా అనంతగిరి మండలంలోని 7 గ్రామాలలో 3129 ఎకరాలు,కోదాడ మండలం లోని 3 గ్రామాల పరిధిలో 1781 ఎకరాలు మొత్తం 5000 ఎకరాలు తీవ్ర కరవు వచ్చిన పాలేరు వాగు నుండి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకొని రావటం జరుగుతుందని తెలిపారు. పాలేరు రిజర్వాయర్ కి సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలు,అలాగే మున్నేరు నీరు ని పాలేరు కి తరలించి సాగు నీరు వదలటం జరుగుతుందని తెలిపారు.శాంతి నగర్ లో పాలేరు వాగుపై ఇప్పుడు ఉన్న చెక్ డ్యామ్ వల్ల ఉపయోగం లేదని మరొక చెక్ డ్యామ్ నిర్మిస్తామని అన్నారు.

రైతులకి పైపులు భూమికింద నుండి పోయిన నష్టపరిహారం చెల్లిస్తామని,ఎత్తి పోతల పథకానికి,చెక్ డ్యామ్ కి రాజకీయాలకి తావు లేకుండా రైతులు సహకరించాలని మనం అందరం కలిసి అద్భుతమైన ఎత్తిపోతల పథకం నిర్మించుకుందాము అని ఈ సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీవో సూర్యనారాయణ, లిఫ్ట్ ఇరిగేషన్ సీఈ రమేష్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ హిమబిందు, మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పిటిసి కొనతం ఉమా,గునుకుల గోపాల్ రెడ్డి పేరు, బుర్ర పుల్లారెడ్డి, కొండపల్లి వాసు, డేగ కొండయ్య, గుర్రం వెంకటరెడ్డి, బుర్ర నరసింహారెడ్డి, రాఘవరెడ్డి, వెంపటి వెంకటేశ్వరరావు, కిరణ్ రెడ్డి, బద్దం కృష్ణారెడ్డి, గింజుపల్లి రఘు, నాగుల మీరా, దస్తగిరి, మట్టపల్లి రామకోటయ్య మట్టపల్లి నరేష్, సంబంధిత అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.