24-05-2025 08:31:37 PM
శంకుస్థాపన చేసిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి..
సారంగాపూర్ (విజయక్రాంతి): మండలంలోని సిరిపెల్లి గ్రామం నుండి బండ్రేవ్ తండా వరకు ఐటిడిఎ నిధులతో రూ.75 లక్షలతో నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, నాగపూర్ పీఆర్ రోడ్డు నుండి దేవితండా వరకు రూ.37 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy) శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం పలు గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, రావుల రాంనాథ్,మండల అధ్యక్షుడు కాల్వ నరేష్, సీనియర్ నాయకులు రాంశంకర్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, ముత్యం రెడ్డి, రాజేందర్ రెడ్డి, సాహెబ్ రావ్, రాజేశ్వర్ రెడ్డి, నాయకులు నారాయణ, విలాస్, ప్రకాష్, వీరయ్య, పోతన్న, నర్సయ్య, రాజు రెడ్డి, తిరుమల చారి, శ్రీకాంత్ రెడ్డి, మహేష్ రెడ్డి, శేఖర్ గౌడ్, వినోద్, గద్దర్, జగదీష్, చాణక్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.