calender_icon.png 25 May, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనాయిపల్లిలో ఘనంగా బోనాల జాతర..

24-05-2025 08:52:16 PM

తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మండలంలోని కోనాయిపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లికి బోనాల జాతర ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యంలో వీధివీధిన అమ్మవారి బోనాలు ఊరేగింపుగా దేవాలయ ప్రాంగంలోనికి కదిలినాయి. మహిళలు పూనకాలతో, పోతరాజుల విన్యాసాలతో కొనాయిపల్లి గ్రామం మారు మ్రోగింది. ఇందులో గ్రామస్తులు, పలువురు కుల సంఘాల నాయకులు, ముదిరాజ్ యువకులు తదితరులు పాల్గొన్నారు.