calender_icon.png 22 December, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వామి పరిశుద్ధానందుడు

20-12-2025 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

* బాల బ్రహ్మచారిగా ఉన్న పరిశుద్ధానందస్వామి, భజన కార్యక్రమాన్ని విజయవంతం చేసి అతికష్టం మీద 20 రూపాయలు సంపాదించారు. ఆ ఇరవై రూపాయలతో ఒక నలబై రోజులు భోజనానికి లోటు రాకుండా చూసుకున్నారు.

హైదరాబాదు నగరానికి దక్షిణం వైపు నాగార్జునసాగర్ రోడ్డు పక్కన ‘పరాశరాశ్రమం’ పేరుతో వెలిసిన దివ్యక్షేత్రమే ‘విశ్వనాథక్షేత్రం’. క్షేత్రపాలకులు శ్రీ పరిశుద్ధానందగిరి స్వామి. వారు ఎక్కువగా ప్రసార మాధ్యమాల్లో కనిపించరు. కానీ సాంఖ్య, యోగ, వేదాంతా చా ర్యులుగా సుప్రసిద్ధులు. ఉపనిషత్తులలో పెద్దదైన బృహదారణ్యకోపనిషత్తు ను, దర్శనాలకే తలమానికమైన యోగ దర్శనాన్ని తెలుగులో అద్భుతంగా వ్యాఖ్యా నించారు.

స్వామి ఆశ్రమంలో ప్రతి ఏకాదశమి రోజు యజ్ఞం ఉంటుంది. ఈ కార్యక్ర మానికి వందలాది భక్తులు, శిష్యు లు పల్లెపట్టుల నుంచి, పట్టణ ప్రాంతాల నుంచి వస్తారు. కొద్దో, గొప్పో ఆధ్మాత్మిక స్పర్శగల నేనొకసారి ఆ కార్యక్రమంలో పాల్గొ న్నాను. ప్రత్యేకమైన పీఠం మీద కూర్చున్న స్వామి లేచి నన్ను ఆలింగనం చేసుకొని సన్మానించడం నాకు జన్మలో మరిచిపోని సంఘటన!

ఉపనిషత్తులపై పట్టు..

వెనుకబడిన పాలమూరు జిల్లాలోని ఒక పల్లె నుంచి వచ్చిన పరిశుద్ధానందగిరి స్వామి.. మలమాళస్వామి స్థాపించిన వ్యా సాశ్రమంలో నాలుగేండ్లు విద్యానందగిరి స్వామి దగ్గర విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత కాశీలో సాంఖ్య, యోగ, వేదాంత శాస్త్రాలను అభ్యసించి, అద్భుతమైన పాండిత్యా న్ని సాధించారు, వైరాగ్యాన్ని అలవర్చుకొన్నారు. వారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడే సన్యాసం స్వీకరించారు. పతంజలి పేర్కొ న్న క్రియా యోగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఉపనిషత్తుల మీద మంచి పట్టు సాధించారు.

శంకరభాష్యం వారికి కరతలామలకం. వారివలె ఉపనిషత్తులోని మం త్రాలను వినిపించేవారు అరుదుగా కనిపిస్తారు. ఏకసంథాగ్రాహి కనుక చిన్నతనం లోనే విషయాలెన్నో వారి స్మృతిపథంలో నిలిచాయి. ఉపనిషత్తుల లోని విషయాలను దృష్టాంతపూర్వకంగా వారు వినిపి స్తుంటే ఒక తెలంగాణ ప్రాంతవాసికి ఇంత స్మృతి (Memory) ఎట్లా వచ్చిందని ఆశ్యర్యం కలుగుతుంది. గుక్క తిప్పుకో కుండా వారు సంస్కృతంలో శాస్త్రోక్తులను పేరాలు పేరాలుగా వినిపిస్తుంటే విస్మయం కలుగుతుంది.

ఆధ్యాత్మిక మార్గం..

పరిశుద్ధానందగిరి స్వామిని చూస్తే ‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్’ అనే గీతావాక్యం గుర్తుకువస్తుంది. బాల్యంలో వారు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గురుకులాల్లో వే దాంత విద్యను అభ్యసించి, ఉపనిషత్తుల జ్ఞానాన్ని సంపాదించి ఒక ఆచార్యునిగానే కాక, సన్యాస జీవితం గడపడం కాష్టసాధ్యమనక తప్పదు! స్త్రీలు, శూద్రులు కూడా వేదాధ్యయనం చేయవచ్చుననే తలంపు ఆర్య సమాజ స్థాపకుడైన దయానంద మహర్షికి కలిగింది.

అదే బాటలో మాలయాళ స్వామి వ్యాసాశ్రమంలో కులభేదా లు పాటించకుండా అందరూ వేదాధ్యయనం చేసే అవకాశం కలిగించారు. మల యాళాశ్రమంతో సంబంధం కలిగిన వా రెంతో మంది ఆధ్యాత్మిక మార్గంలో ప్ర యాణిస్తూ, ఆచార్యులుగా ప్రసిద్ధి పొందినారు. పరిశుద్ధానందగిరి స్వామి కూడా అట్టివారిలో ప్రముఖులని చెప్పవచ్చు. ఆశ్రమ స్థాపన జరిగి నూరేళ్లు గడిచినా, మలయాళ స్వామి ఆశయాలు సమాజాన్ని ప్రభావితం చేయడం విశేషం.

ఇరవై రూపాయల కోసం..

వారు కాశీలో చదివేటప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. వేళకు భోజనం లభించేది కాదు. ఇరవై రూపాయలుంటే నలబై రోజుల తిండికి ఇబ్బంది ఉండేది కా దు. కాని పనిచేసి ఒక్క రూపాయి సంపాదించాలంటే ఎంతో కష్టమయ్యేది. తాను నేర్చుకుంటూ ఇతరులకు నేర్పడం వల్ల లభించిన ధనమే స్వామి జీవితానికి ఎం తో ఉపయోగపడింది. స్వామికి భజన అం టే చాలా ఇష్టం. కాశీకి సినిమా తీయడానికి వచ్చిన వారు, దృశ్యీకరణలో భాగం గా ఒక భజన బృందాన్ని వెదుకవలసి వచ్చింది.

స్వామి భజన బృందానికి నాయకులు. అందరూ బ్రహ్మచారులే గనుక భజ న చేస్తూ నడుస్తుంటే కెమెరాలో ఆ దృశ్యాన్ని బంధించాలి. అతికష్టం మీద స్వా మిని ఒప్పించి భజన చేస్తున్న దృశ్యా న్ని చిత్రీకరించారు. అంతవరకు బాగానే ఉం ది. సినిమా వారు చిత్రీకరణ చేశారు కానీ, భజన బృందానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఒక రోజంతా తాము చెప్పినట్లు చేస్తే 20 రూపాయలిస్తారట.

సరే అని మిత్రుల కోరిక మేరకు సినిమా వాళ్లు చెప్పినట్లు బాల బ్రహ్మచారిగా ఉన్న పరిశుద్ధానందస్వామి, భజన కార్యక్రమాన్ని విజయవం తం చేసి అతికష్టం మీద 20 రూపాయలు సంపాదించారు. ఆ ఇరవై రూపాయలతో ఒక నలబై రోజులు భోజనానికి లోటు రాకుండా చూసుకున్నారు. ఇది నిజంగా వారి జీవితంలో మరవలేని సంఘటన.

స్వామి దర్శనార్థం..

ఆ తర్వాత పరిశుద్ధానందులెన్నడూ జీవితంలో సినిమాల వైపు చూడలేదు. షూటిం గులో పాల్గొనలేదు. కాని వారు సన్యాసాన్ని స్వీకరించి, విశ్వనాథక్షేత్రాన్ని స్థాపిం చి, గొప్ప ఆధ్యాత్మిక ప్రవక్తగా మా రిన తర్వాత సినిమాల్లో ఒక సన్యాసిగానే నటించమని ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కాని వాటి ని వారు తిరస్కరించారు. కారణం ఏమం టే, సన్యాసులు సినిమాల్లో నటించరాదనేది వారి సిద్ధాంతం, వారి దృక్పథం. నేనొకసారి ప్రణవానందాశ్రమం నిర్వాహకులు సత్యానందస్వామి గారితో వెళ్లి వారి ని విశ్వనాథక్షేత్రంలో కలిసినప్పుడు ఒక విచిత్రమై న సంఘటన జరిగింది.

ఒక సినిమా దర్శకుడు వచ్చి స్వామికి నమస్కరించి ఒక కోరిక కోరాడు. తాను తీస్తున్న సినిమాలో శివునికి సంబంధించిన దృ శ్యంలో కొద్దిసేపు పరిశుద్ధానందగిరి స్వామి కనిపించాల న్నదే ఆయన కోరిక. ఆశ్రమాభివృద్ధికి కొంత డబ్బు కూడా ఇస్తానని ఆశ చూపా డు కానీ అతని ఆశ తీరలేదు.‘సన్యాసి ఐనవాడు తక్కిన మూడు ఆశ్రమాలకు ఆదర్శం గా ఉండాలి. ఆశ్రమ ధర్మాన్ని నిర్వహిస్తూ జీవించాలి గాని, నటించరాదు’ అని స్వామి అతనికి మృదువుగానే తెలియజేశారు.

స్వా మి ఆశ్రమంలో నా ముందు జరిగిన ఆ సం ఘటన ఎల్లకాలం నా స్మృతిలో ఉండిపోయింది. నాలగు ఆశ్రమాల్లోనూ మనిషి జీవితం పవిత్రంగా ఉండాలి. సన్యాసులు కూడా నటి స్తే ఇక జీవితంలో సహజంగా జీవించేవారెవ్వరు? ఈ సంఘటన జరిగిన తర్వాత, ఎప్పుడో గాని వెళ్లని నేను నెలకొకసారి స్వామి దర్శనార్థం విశ్వనాథక్షేత్రానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాను.

 వ్యాసకర్త సెల్: 9885654381