calender_icon.png 12 January, 2026 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వామి వివేకానంద బోధనలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి

12-01-2026 04:19:03 PM

కొల్చారంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

కొల్చారం,(విజయక్రాంతి): స్వామి వివేకానంద బోధనలను యువత స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కొల్చారం సర్పంచ్ దేవన్న శేఖర్ అన్నారు. సోమవారం స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం మండల కేంద్రమైన కొల్చారంలో సంఘమిత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

యువతలో దేశభక్తి పెంపొందించేందుకు స్వామి వివేకానంద ఇంతగానో కృషి చేసినట్లు తెలిపారు. యువత నిర్వీర్యం కాకుండా ఉండేందుకోసం స్వామి వివేకానంద బోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు సంగమేశ్వర్ సంఘమిత్ర యోజన సంఘం సభ్యులు పాల్గొన్నారు