12-01-2026 06:39:30 PM
ఉప్పల్,(విజయక్రాంతి): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీలు తూచా తప్పకుండా నెరవేరుస్తుందని ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క నుఁడి వచ్చిన గ్రీటింగ్స్ కార్డు ను గృహజ్యోతి లభిదారులుకు ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఉప్పల్ నియోజకవర్గం లోని గృహ లక్ష్మీ పథకం కింద లక్ష కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
అర్హులై ఉండి నెలకు 200 యూనిట్లు లోపు వినియోగించిన పేద మధ్య తరగతి కుటుంబాలకు జీరో బిల్ కింద ఉచితంగానే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని ఇప్పటికే మహాలక్ష్మి పథకం గృహ లక్ష్మీ పథకం ప్రజలు సద్విని చేసుకుంటున్నారని రజిత పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ లైన్మెన్ సుధాకర్ రెడ్డి రవి డివిజన్ అధ్యక్షుడు లక్ష్మణ్ లింగంపల్లి రామకృష్ణ ప్రభాకర్ రెడ్డి మహంకాళి రాజు పాల్గొన్నారు.
మల్లాపూర్ డివిజన్ లో గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని విజయవంతంగా అందిస్తూ పేద మధ్యతరగతి కుటుంబాల విద్యుత్ బిల్లు భారాన్ని పడకుండా చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ అన్నారు. మల్లాపూర్ డివిజన్లోని జీరో బిల్ పొందిన గ్రీటింగ్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఈ సుబ్బారావు ఏడి దశరథ్ లైన్మెన్ సాయి మల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు కపరా సాయి బాల రాజ్ ముజీబ్ శ్రీనివాస్ పర్వతాలు పాల్గొన్నారు.