calender_icon.png 12 January, 2026 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా శ్రీ వేణుగోపాలస్వామి గోదాదేవి తిరు కళ్యాణ మహోత్సవ వేడుకలు

12-01-2026 04:22:58 PM

కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే విజయ రమణారావు

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం ఆవరణలో సోమవారం శ్రీ సంతాన వేణుగోపాలస్వామి గోదాదేవి తిరు కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండువగ జరిగాయి, ఈ కళ్యాణ వేడుకల ను అర్చకులు సౌమిత్రి శ్రావణ్ కుమార్, వేణుమాధవ్, రఘు లు ఘనంగా జరిపించారు.

ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా  పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మున్సిపల్ కమిషనర్ రమేష్ లు పాల్గొన్నారు,ఈ కళ్యాణ వేడుకల్లోఆలయ చైర్మన్ పల్ల సదా లక్ష్మీ మురళీధర్, పల్ల లతా శ్రీనివాస్ (వాసు), బిరుదు సమతా కృష్ణ , ముత్యాల శ్రీదేవి రవీందర్ , పాత మల్లేశ్వరి శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమం లో శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, పూసల శ్రీ లక్ష్మీ నారాయణ  దేవాలయం చైర్మన్ పురం హరికిషన్ రావు, సామాజిక సేవకులు పల్లకిషన్ తోపాటు పెద్ద ఎత్తున భక్త బృందం పాల్గొన్నారు.