calender_icon.png 12 January, 2026 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

12-01-2026 06:42:43 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను సేకరించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు బాధితులకు భరోసా కల్పించారు. సారంగాపూర్ మండలంలోని తాండ్ర గ్రామంలో కొందరు చెరువు భూములను ఆక్రమించుకున్నారని వారిపై చర్య తీసుకోవాలని గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ ఖానాపూర్ లో చచ్చిపోయిన మహిళకు అధికారులు పాస్బుక్ జారీ చేశారని ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ జడ్పి సీఈఓ శంకర్ అధికారులు ఉన్నారు.