12-01-2026 06:45:27 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని అక్కంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల సర్వేనెంబర్ 95 గల భూమిని గ్రామపంచాయతీ కేటాయించాలని కోరుతూ అక్కంపల్లి గ్రామ సర్పంచ్ వెంక గౌడ్, గ్రామస్తులు అందరూ కలిసి సోమవారం మండల డిప్యూటీ తాసిల్దార్ రాజేశ్వర్కు అందజేశారు. ఈ సందర్భంగా అక్కంపల్లి గ్రామస్తులు గ్రామానికి నూతన గ్రామపంచాయతీ భవనం మంజూరైనందున గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ స్థలాన్ని పరిశీలించి గ్రామపంచాయతీ భవనం నిర్మించుకోవడానికి స్థలాన్ని కేటాయించాలని, వినతి పత్రాన్ని అందజేశారు. 95 సర్వే నెంబరు గల భూమిని గ్రామపంచాయతీ, గవర్నమెంట్లోనికి ఉంచగలరని గ్రామ ప్రజల సమక్షంలో వినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగే ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయానికి కూడా వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బండ బాబు గ్రామస్తులు పాల్గొన్నారు.