12-01-2026 06:51:15 PM
మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రంలో ముదిరాజ్ సంఘం నాయకులు
మంథని,(విజయక్రాంతి): మంథనిలో ముదిరాజ్ కుల సంఘం, భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని సోమవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు ముదిరాజ్ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ మంథనిలో ముదిరాజ్ కుల సంఘం భవనం లేదని, వెంటనే నిర్మాణం కేటాయించాలని వినతి పత్రం అందజేయడం జరిగిందని, దీనికి వెంటనే మంత్రి సానుకూలంగా స్పందించి తొందరలో సాంక్షన్ చేపిస్తానని హామీ ఇచ్చారన్నారు. స్పందించిన మంత్రికి ముదిరాజు కుల సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.