calender_icon.png 12 January, 2026 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుక్కాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

12-01-2026 06:35:33 PM

తుక్కాపూర్ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు

కొల్చారం,(విజయక్రాంతి): ఎమ్మెల్యే సునీతారెడ్డి సహకారంతో గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజల తీర్మానం మేరకు  తుక్కాపూర్ గ్రామాభివృద్ధికి  అహర్నిశలు కృషి చేస్తానని  తుక్కాపూర్ గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి దొడ్ల ఆంజనేయులు  అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామంలో  సంపూర్ణ పారిశుద్ధ్య పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రంగంపేట నుంచి తుక్కాపూర్ గ్రామానికి వచ్చే ఇరుపక్కల ముళ్ళ పొదలు పెరిగి రోడ్డుకు అడ్డంగా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, తను సొంతంగా   జెసిబి తో తొలగిస్తున్నట్లు తెలిపారు. అలాగే పాఠశాల ఎదురుగా మురికి కాలువ  నిండిపోయి దుర్గంధం  వెదజల్లుతుందని, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు  అనారోగ్యానికి గురి కాకుండా  పారిశుద్ధ్య పనులు, కాలువ పూడికతీత తీస్తున్నట్లు ఎమ్మెల్యే సహకారంతో  నిధులు మంజూరు మురికి కాల్వ నిర్మాణం  చేపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆరే రవీందర్, వార్డు సభ్యులు   గ్రామ పెద్దలు పాల్గొన్నారు.