calender_icon.png 6 October, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు పెన్షనర్ల యూనిట్ అధ్యక్షులుగా మూడోసారి స్వామిదాసు ఏకగ్రీవంగా ఎన్నిక

06-10-2025 06:27:09 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు పెన్షనర్ల యూనిట్ సర్వసభ్య సమావేశం సోమవారం ఇల్లందులో పేషనర్స్ భవనంలో జరిగింది. జిల్లా అధ్యక్షులు ఈజిఆర్ వెస్లీ, ప్రధాన కార్యదర్శి ఆరు వెంకటేశ్వరరావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి సాదినేని పూర్ణచంద్ర రావు, మాజీ ఎంఈఓ పిల్లి శ్రీనివాసరావు, మాజీ ఎండిఓ జాఫర్ పాల్గొన్నారు. సమావేశ అనంతరం 2025-2028 మూడు సంవత్సరాలకు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల నిర్వహణ అధికారిగా చండ్రుగొండ యూనిట్ అధ్యక్షులు కే సుధాకర్ రావు, కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపాల్ అబ్జర్వర్ గా నిర్వహించారు. అధ్యక్షులుగా మూడోసారి దాసరి స్వామి దాసు, సెక్రటరీగా సిహెచ్ వెంకయ్య, ఫైనాన్స్ సెక్రటరీగా సిహెచ్ రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిపిఎస్ ను రద్దు చేయాలని, సిపిఆర్సిని ఇవ్వాలని, పెండింగ్ డీఏలు ఇవ్వాలని, 398 టీచర్స్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, అన్ని హాస్పిటల్లో హెల్త్ కార్డుని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.