calender_icon.png 17 February, 2026 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి మున్సిపల్‌చైర్ పర్సన్‌గా స్వాతి

17-02-2026 01:11:30 AM

వైస్ చైర్మన్‌గా రాగం శెట్టి సతీష్ ఎకగ్రీవం

బెల్లంపల్లి, ఫిబ్రవరి 16: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరిత వాతావరణం లో జరిగింది. సోమవార.మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ మనోజ్ సమక్షంలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చెందిన 7వ వార్డు కౌన్సిలర్ దావ స్వాతి చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు.

అదే పార్టీకి చెందిన 17  వార్డు కౌన్సిలర్ రాగం శెట్టి సత్యనారాయణ వైస్ చైర్మన్ గా ఎన్నీకయ్యారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు 14 మంది, ఐదుగురు స్వతంత్రులు, ఒక బీజేపీ కౌన్సిలర్, ఎక్స్ అఫీషియో,ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఓటు వేశారు. 21 ఓట్లు ఇరువురికి వేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ తో సహా  కౌన్సిలర్లు  క్యాంపు నుంచి  ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.

తొలుత నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రత్యేక అధికారి మనోజు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. సభ్యులు చేతులు పైకి లేపి ఓటు వేశారు. నూతనంగా ఎన్నికైన చైర్ పర్సన్ దావ స్వాతి, వైస్ చైర్మన్ రాగం శెట్టి సత్యనారాయణ లతో ప్రత్యేక అధికారి మనోజ్ ప్రమాణ స్వీకారం చేపించారు. బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు.