calender_icon.png 30 September, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగ పూట తీపి కబురు

30-09-2025 01:12:06 AM

  1. దసరాకు కిక్కే కిక్కు

ఆ రెండు గ్రామాలకు ఎన్నికలు లేవు

కరీంనగర్, సెప్టెంబర్29(విజయక్రాం తి):సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్లకు రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారు కాగా సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇక పల్లెలలో దసరాకు డబుల్ కిక్కే అంటున్నారు. ఎన్నికలలో పోటికి సిద్ధం అవుతున్న నేతలు పల్లెల లో దసరా కానుకలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లడంతోగతం కన్నా బీసీలకు ఉమ్మడి జిల్లాలో స్థానాలు పెరిగాయి.

గత కొన్ని నెలలుగా గ్రామాల వారీగా ఎదురుచూస్తున్న ఆ శావహుల ఉత్కంఠకు తెరపడింది. కలిసొచ్చినా రిజర్వేషన్తో పలువురు సంబరాలు జరుపుకుంటు పోటీ కి సిద్ధం అవుతున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లలో కరింనగర్ బి సి జనరల్, సిరిసిల్ల ఎస్ సి జనరల్, పెద్దపల్లి జనరల్ మహిళ, జగిత్యాల జనరల్ మహిళకు రిజర్వు అయ్యాయి.జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్ జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉండగా వీటి పరిధిలో 318 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

మొత్తం 2962 వార్డులు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉండగా 385 గ్రామ పంచాయతీలు, 3,536 వార్డులు ఉ న్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలు ఉండగా 260 గ్రామ పంచాయతీలు, 2,268 వార్డులు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 13 మండలాలు ఉండగా 263 గ్రామ పంచాయతీలు వాటి పరిదిలో 2432 వార్డులు ఉన్నాయి.

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు...

కరీంనగర్ జిల్లాలో మొత్తం జడ్పీటీసీ స్థానాలు 15 ఉండగా 170 ఎంపీటీసీ స్థానా లు ఉన్నాయి. అలాగే జగిత్యాల జిల్లాలో 20 జడ్పీటీసీ స్థానాలు ఉండగా 216 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 13 జడ్పీటీసీ స్థానాలు ఉండగా 137 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 జడ్పీటీసీ స్థానాలు ఉండగా 123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.ఆ రెండు గ్రామాల్లో ఎన్నికలకు బ్రేక్  కరీంనగర్ జిల్లాసైదాపూర్ మండలం రామచంద్రాపూర్, కురుమపల్లి గ్రామాలకు స్థానిక సంస్థల ఎన్నికల కు బ్రేక్ పడింది.

రామచంద్రపురం గ్రామంలోని కు రువపల్లి ఆమ్లెట్ గ్రామంగా ఉండేది. అ యితే గత ప్రభుత్వం కురుమపల్లె ను గ్రామపంచాయతీగా ప్రకటించింది. కాగా నిబంధ నలకు విరుద్ధంగా కురుమపల్లెను గ్రామపంచాయతీ ఏర్పాటు చేయడాన్ని స వాలు చేస్తూ రామచంద్రాపూర్ గ్రామస్తులు పోతా రం నవీన్, ములుగు రాజులు హైకోర్టులో కేసు వేశారు. దానిపై ఎలాంటి తీర్పు రాకపోవడంతో ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది.

స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి 

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ లోకల్ బాడీ ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలి. సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి.రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ..

రెండు విడతల్లో గ్రామపంచాయతీ (సర్పంచ్ వార్డు సభ్యులు) ఎన్నికలు మొత్తం ఐదు విడతల్లో నిర్వహించనున్నారు. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నవంబర్ 11 వరకు పూర్తి కానుంది. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో జిల్లాలో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకివచ్చింది. 

 కలెక్టర్ పమేలా సత్పతి