calender_icon.png 30 September, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్రెపల్లి చెరువును ఆహ్లాదమైన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి

30-09-2025 01:10:19 AM

ఎమ్మెల్యే విజయ రమణారావు 

సుల్తానాబాద్ , సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి):సుల్తానాబాద్ మండలం  గర్రెపల్లి గ్రామంలోని చెరువు వద్ద ఏర్పాటు చేసిన ప రమశివుని విగ్రహా ప్రతిష్ఠాపన చేసి అనంతరం బతుకమ్మ ఘాటును గ్రామ ప్రజలతో, స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు సోమవారం ప్రారంభించారు....ఈ సందర్బం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ దాదాపు 16 లక్షల రూపాయలతో గర్రెపల్లి చెరువు వద్ద నిర్మించిన విగ్రహాలు ఆహ్లాదాన్ని అం దించే విధంగా ఉన్నాయన్నారు.

గ్రామంలో చక్కటి వాతావరణాన్ని నెలకొల్పి ప్రజలు సాయంకాలం వేళలో ఆనందంగా గడిపేందుకు గ్రామంలో ఉన్న ప్రకృతిని అందంగా మలిచి ప్రజలకు చేరువలోకి తీసుకువచ్చేందుకు కృషి చేసిన వారిని అభినందించారు. కన్నా రమేష్ గౌడ్ గ్రామంలో చెరువులో శివుడి విగ్రహాన్ని అలాగే బతుకమ్మ ఘాటు ను ఏర్పాటు చేసేందుకు దాతల సహకారం తో ముందుకు వచ్చి అకుంఠిత దీక్షతో విగ్రహాలను పూర్తి చేయడం గర్వించదగ్గ విషయమన్నారు.

గర్రెపల్లి లో అతిపెద్ద చెరువు ఉం డడం దీని ద్వారా కింది గ్రామాలకు ప్రాణదారగా ఈ నీరు ఉపయోగపడుతుందని, రైతుల పొలాలకు ఈ నీరును వినియోగించి పంటలు పండిస్తున్నారని అన్నారు. పైనుండి వచ్చిన నీరు చెరువులో చేరి నిండుకుండలా ఎప్పుడు కళకళలాడుతుందని అన్నారు. ఇక్కడి ప్రజలకే కాకుండా మండల ప్రజలకు ఈ ప్రాంతం చక్కటి టూరిజంలా ఉపయోగపడుతుందని అన్నారు.

రానున్న రోజులలో మరింత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. విగ్రహల నిర్మాణానికి సహకరించిన ఊరు పెద్దలు దాతలను ఎమ్మెల్యే సన్మానించారు. సమిండ్ల కిషన్ రావు దంపతులు, అమీర్ శెట్టి రాధాకృష్ణ దంపతుల తో పాటు రెండు లక్షల 50 వేల రూపాయలు విగ్రహాల నిర్మాణానికి అందించిన జూపల్లి తిరుమల రావు లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పడాల అజయ్ గౌడ్, ఏవి రమణారావు, కల్లపల్లి జానీ , గ్రామ పెద్దలు , కాం గ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు , గ్రామస్తులు పాల్గొన్నారు.