18-07-2025 10:47:26 PM
నూతనకల్,(విజయక్రాంతి): నూతనకల్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్ లో శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. హాస్టల్ లో భోజన వసతులు, ఇతర సదుపాయల గురించి విద్యార్థులను ఆరాతీశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను వినియోగించుకొవాలని, ఉన్నత విద్యనబ్యసించి తమ తల్లితండ్రుల కలలను నెరవేర్చాలని ఆయన అన్నారు.