calender_icon.png 19 July, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాల కోసం రైతుల ప్రత్యేక పూజలు

18-07-2025 10:42:07 PM

కృష్ణ జలాలతో ఆలయాల దిగ్బంధం

చిన్న చింతకుంట: వర్షాకాలం సీజన్ ఆరంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నా సరైనా వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.  శుక్రవారం చిన్న చింతకుంట గ్రామ రైతులు ఎడ్లబండ్లు తో పవిత్ర మైన కృష్ణ జలాలను గ్రామ పోలిమేర నుంచి భక్తి శ్రద్ధలతో డప్పు వాయిద్యాలతో భజన కీర్తనలతో మహిళలు మంగళహారతుల తో కృష్ణాజలాల ను గ్రామంలో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.  బస్టాండ్ కూడలిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం,  రుద్ర లింగేశ్వర స్వామి ఆలయంలోని శివలింగాన్ని కృష్ణాజలాల తో జలదిగ్బంధం చేసి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్బంగా గ్రామ రైతులు మాట్లాడుతూ తొలకరితో మురిపించిన వానలు మొఖం చాటేశాయి కోటి ఆశలతో విత్తనాలు నాటిన రైతన్నలు వర్షాల కోసం ఆకాశం కేసి చూస్తున్నామని,  వరుణుడు కరుణించాలని సమృద్ధిగా వానలు కురవాలని ప్రత్యేక పూజలు చేశామన్నారు. సమస్త జీవకోటి బతకాలంటే రైతన్న పండించిన పంటలే జీవనాధారం అలాంటి పంటలు పండాలంటే వర్షాలే దిక్కు వానలు సకాలంలో కురవకపోవడంతో రైతన్నలు ఆగమాగం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.   ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు విజయ మోహన్ గౌడ్, దశరథ్ గ్రామ పెద్దలు నంబి రాజు, కుర్వ రమేష్, యస్ వెంకటేష్, బాలరాజు, శ్రీకాంత్,  నాగిరెడ్డి, పల్లె మహేష్, వన్నం శ్రీనివాస్, గ్రామ రైతులు పాల్గొన్నారు.