calender_icon.png 1 May, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మర్ ఉచిత క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి

01-05-2025 12:16:23 AM

ఆదిలాబాద్, ఏప్రిల్ 30 (విజయ క్రాం తి): ఉచిత సైన్స్ వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. స్థానిక డైట్ కాలేజ్‌లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యం లో మే 6వ తేదీ వరకు నిర్వహించే ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని డీఈఓ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి తప్పకుండా ఈ శిబిరాలను వినియోగించుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించా రు.

ఈ శిక్షణలో ఫన్ మాథ్స్, ఫన్ సైన్స్, మిరాకిల్ ఎక్స్పోజర్, ఓరిగామి, డ్రాయింగ్, గుడ్ హ్యాండ్ రైటింగ్ లపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని సభ అధ్యకులు సంజీవ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డైట్‌వైస్ ప్రిన్సిపల్ కిరణ్, గోవర్ధన్, మాథ్స్ ఫోరం అధ్యక్షు లు దిలీప్ రెడ్డి, ఆవుల మహేందర్, వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్, ప్రధాన కార్యదర్శి ఉషన్న, శ్రీధర్ బాబు, సంతోష్ కుమార్, ప్రేమ్ కుమార్ గంగన్న, మెస్రం రాజు తదితరులు పాల్గొన్నారు.