calender_icon.png 11 October, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

11-10-2025 01:49:28 AM

నంగునూరు అక్టోబర్ 10:రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేం ద్రాల్లో విక్రయించి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని మండల తహశీల్దార్ మాధవి కోరారు.మండలంలోని పాలమాకుల, ముండ్రాయి, రాజగోపాల్ పేట, రాంపూర్, అం క్షాపూర్, గట్లమల్యాల, ఖాతా గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ తో కలిసి తహశీల్దార్ మాధవి ప్రారంభించారు.

ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరల ప్రకారం,ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2389/- చొప్పున, కామన్ గ్రేడ్ ధాన్యానికి రూ. 2369/- చొప్పున ధరను అందించడం జరుగుతుందని తహశీల్దార్ మాధవి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్లు కోల రమేష్ గౌడ్, మహిపాల్ రెడ్డి,మండల వ్యవ సాయ అధికారి గీతా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లింగం, నాయకులు సారయ్య, వేణు చక్రవర్తి, అయిలయ్య, కుమార స్వామి, అశోక్, వేణుచారి, రమేష్, ఆయా మండలాల ఐకేపీ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.