calender_icon.png 29 October, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాదారులపై హైడ్రా కొరడా

28-10-2025 11:59:24 PM

-హస్తినాపురంలో 1.27 ఎకరాల పార్కు స్థలానికి విముక్తి

-చందానగర్ సర్కిళ్ల పరిధిలో కబ్జా నుంచి ప్రభుత్వ భూమిని కాపాడిన అధికారులు 

-ప్రజావాణి ఫిర్యాదులపై కమిషనర్ తక్షణ స్పందన  

హైదరాబాద్ సిటీ బ్యూరో/ఎల్‌బీ నగర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : నగరంలో ప్రభుత్వ, ప్రజా స్థలాలను కబ్జా చేస్తున్న భూ బకాసురులపై హైడ్రా ఉక్కుపాదం మోపిం ది. ‘ప్రజావాణి’లో అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడు ల్లో హస్తినాపురంలో ఎకరాకు పైగా విస్తీర్ణంలో ఉన్న పార్కు స్థలానికి, చందానగర్‌లో పేదల కోసం కేటాయించిన ప్రజావసరాల స్థలానికి కబ్జా నుంచి విముక్తి కల్పించింది.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అధికారులు ఈ చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్ మండలం, హస్తినాపురం నార్త్ ఎక్స్ టెన్షన్ కాలనీలో లేఅవుట్ ప్రకారం కేటాయించిన 1.27 ఎకరాల పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని కాల నీ అసోసియేషన్ ప్రతినిధులు ఇటీవల హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు మంగళవారం ఆక్రమణలను తొలగించారు.

విలువై న పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి, ఈ స్థలం హైడ్రా ఆధీనంలో ఉందని హెచ్చరిక బోర్డులను ఏర్పా టు చేశారు. స్థానిక కార్పొరేటర్ సుజాతనాయక్ ఆధ్వర్యంలో స్థానికు లు పార్కు స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శేరిలింగంపల్లి జోన్, చందా నగర్ సర్కిల్ పరిధిలోని గంగారాంకాలనీలో 1974లో సాంఘిక సంక్షేమశాఖ పేదల కోసం సుభాష్‌నగర్ పేరుతో లేఅవుట్ వేసిం ది.

ఇందులో 700 గజాల స్థలాన్ని ప్రజావసరాల కోసం కమ్యూనిటీహాల్ వంటివి కేటాయించారు. అయితే, ఓ వ్యక్తి ఈస్థలాన్ని ఆక్రమించి ప్లాట్లుగా మార్చేశాడు. ఈస్థలాన్ని కాపాడాలంటూ స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. సుమారు 500 గజాల స్థలాన్ని స్వాధీనంచేసుకుని ఫెన్సింగ్ ఏర్పా టు చేశారు. నగరంలో చెరువులు, పార్కులు, ప్రజాస్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా అధికారులు హెచ్చరించారు.